ఎవరైనా వీడియో కాల్స్ ద్వారా విచారణ, డిజిటల్ అరెస్ట్ అని బెదిరిస్తే అది ఖచ్చితంగా మోసమే అని గ్రహించండి. డిజిటల్ అరెస్ట్ అనే వ్యవస్థ లేనే లేదు. కొత్త తరహా సైబర్ మోసాలపై మీ తోటివారికి కూడా అవగాహన కల్పించండి.
#telanganapolice #Digitalarrest
కేవలం ఒక్కనిమిషం రెడ్ సిగ్నల్ దగ్గర ఆగితే ప్రమాదాలను నివారించవచ్చు. తొందరపాటులో రెడ్ సిగ్నల్ జంప్ చేసి ప్రమాదాలకు కారణం అవ్వొద్దు. మీతో పాటూ ఇతరుల కుటుంబాల్లో విషాదం నింపొద్దు. ట్రాఫిక్ నిబందనలు పాటించడం ద్వారా ప్రమాదాల నివారణ సాధ్యం.
#telanganapolice
ట్రాఫిక్ చలాన్ పేరిట సైబర్ మోసాలు జరుగుతున్నాయి జాగ్రత్త. చలాన్ చెల్లించేందుకు కేవలం అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే ఆశ్రయించండి. ట్రాఫిక్ చలాన్ అంటూ ఏదైనా మెసేజ్ వస్తే లింక్ క్లిక్ చేయొద్దు. కేవలం echallan.tspolice.gov.in ను సంప్రదించండి.
#telanganapolice
సైబర్ మోసానికి గురయ్యామని గ్రహించిన వెంటనే 1930కు కాల్ చేయండి. మోసం జరిగిన గంటలోగా ఫిర్యాదు చేయడం ద్వారా మీ డబ్బు రీఫండ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నేరం జరిగిన వెంటనే పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయడం ద్వారా అకౌంట్ ఫ్రీజ్ చేసి, మీ డబ్బుల రీఫండ్ తీసుకువచ్చేందుకు యత్నిస్తారు.
హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేస్తే ఏమౌతుందిలే.. అనుకొని మీరు చేసే చిన్న నిర్లక్ష్యం ఇతరులతో పాటూ మీ కుటుంబానికి తీరని నష్టం చేస్తుంది. హెల్మెట్ మీ ప్రాణం నిలిపే రక్షణ కవచమని గుర్తుంచుకోండి.
#telanganapolice #safetyfirst #safedriving
You don’t need influence or permission to file an FIR. It’s your legal right. Here’s how to do it.
#FIRAwareness #KnowYourRights #JusticeStartsWithYou #telanganapolice
#Aadhaar is your identity. Don’t let criminals use it as a weapon! Fake SIMs are being activated under your name, stay alert!
#SIMFraud #DigitalAlert #telanganapolice
Rushing to board a moving bus can get you caught in the doors or wheels; board only when it has stopped completely and the door is fully open #SadakSurakshaJeevanRaksha #RoadSafety
సులభంగా లాభాలు వస్తాయనే ప్రకటనలతో జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడి పెట్టేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. వాట్సాప్, టెలిగ్రాం గ్రూపుల్లో కనిపించే స్క్రీన్ షాట్స్, ప్రకటనలను నమ్మితే మోసపోతారు. ఇన్వెస్టిమెంట్ మోసాలపై అవగాహన పెంచుకోండి.
#telanganapolice
#TodaysThemePoster
🛑 THRILL ENDS – PAIN REMAINS 🛑
Dear Youth,
A moment of thrill can lead to a lifetime of pain.
Today's stunt could be tomorrow’s regret.
Fame fades-Wounds stay.
Ride Wise-Live Longer.
🚫 #StuntFreeRoads
🛡️ #FameFadesSafetyStays
🧒🏼 OPERATION MUSKAAN - XI | Help us Find the Lost Laughter
Stolen childhood. Silent suffering. But together, we can bring them back.
Every child deserves safety, love, and a smile.
Let’s unite to identify, protect, and reunite missing children with their families.
📞 If you see
#Sundays_Weekly_Theme_Video
🚨 ‼️సూచన - ఇది ఒక హెచ్చరిక‼️ 🚨
👨💼 ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చట్ట ఉల్లంఘన!
🧑💻 యూత్! మిమ్మల్ని ఎవ్వరూ గుర్తించలేరనుకుంటే పొరపాటే — సరికొత్త టెక్నాలజీతో ఎక్కడైనా గుర్తించి చట్టం ముందుకు తీసుకువస్తాం.
👪 తల్లిదండ్రులారా! మీ పిల్లలు తప్పుదారి పడకుండా
ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నందున వాహనదారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ వాహనం కండీషన్‌ను చెక్ చేయండి. నీరు నిలిచి ఉన్న ప్రాంతాల్లో జాగ్రత్త. రోడ్లు తడిగా ఉంటాయి కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ. కాబట్టి నెమ్మదిగా గమ్యం చేరండి.
#telanganapolice #saferide
మీ ఆధార్ డేటా చాలా అమూల్యమైనది. ఎక్కడపడితే అక్కడ ఆధార్ వివరాలు ఇవ్వొద్దు. ఆధార్ డౌన్‌లోడ్ చేసుకునేందుకు గానీ, వినియోగించుకునేందుకు గానీ ఎవరికీ ఓటీపీ చెప్పొద్దు. అపరిచిత సైట్లలో ఆధార్‌కార్డు వివరాలు ఇవ్వడం ద్వారా సైబర్ మోసాలకు గురికావొచ్చు.
#telanganapolice
#TodaysThemePoster
🔍 A stolen face, a borrowed name…
🕵️♂️ Synthetic IDs play a silent game.
👥 Names may shift, faces may change
💻 Fraudsters move in digital range.
🚨 Police eyes see through the shade
🔐 Guarding trust, justice never delayed.
#CyberFraud #DigitalSafety
ఏటీఎం సెంటర్ల దగ్గర అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. డబ్బు విత్ డ్రా చేసేందుకు సహాయం చేస్తామంటూ ఎవరైనా మాట కలిపితే తిరస్కరించండి. మీ కార్డును ఎట్టిపరిస్థితుల్లో వారికి ఇవ్వొద్దు, ఏటీఎం పిన్ నంబర్ చెప్పొద్దు.
#telanganapolice #BeAlert
"Click this link" = Click to danger! Never share OTPs. Never click unknown links.
Stay safe from phishing!
#PhishingAlert #CyberSafeTelangana #TelanganaPolice
కేవలం మీ దగ్గర స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు ఇంట్లో ఉంటూనే వేలు సంపాదించవచ్చనే మాటల్ని నమ్మకండి. వర్క్ ఫ్రమ్ హోం జాబ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆన్‌లైన్ టాస్క్‌లు, మార్కెటింగ్‌తో డబ్బులు రావు. ఇలాంటి మోసాలపై అవగాహన పెంచుకోండి.
#telanganapolice #WorkFromHomeJobScams
One moment of carelessness = A lifetime scar.
Chain snatchers are faster than you think. Be alert, not sorry.
#ChainSnatchingAlert #StayAware #TelanganaPolice