కస్తూరి కలం ✍ (@kasturikalam) 's Twitter Profile
కస్తూరి కలం ✍

@kasturikalam

సమాజ హితము కోసమే పద సంయోజనము పోతన పల్కుల మాధుర్యం, విశ్వనాధ గాంభీర్యం, ముళ్ళపూడి అక్షరం, శ్రీశ్రీ శైలి, గురజాడ అడుగుజాడ, యండమూరి ఆలోచన నాకిష్టం 🙏

ID: 1142055764074176512

calendar_today21-06-2019 13:04:47

1,1K Tweet

3,3K Followers

164 Following

కస్తూరి కలం ✍ (@kasturikalam) 's Twitter Profile Photo

లక్ష రూపాయలతో కొత్త ఫోన్ కొంటారు అమ్మ నాన్నలకి రోజూ ఫోన్ చేసి పలకరించే సమయం మాత్రం వాళ్ళకి ఎప్పుడూ ఉండదు ఎవరి కోసం "బిజీ" ఎందుకోసం "బిజీ" ఎక్కడికీ పరుగు ?....ఎందుకనీ పరుగు ? ఆత్మావలోకనం చేసుకునే తీరిక, ఓపిక, ధైర్యం అస్సలు లేని పిరికివాళ్ళు మన చుట్టూ ఉన్నారు....

కస్తూరి కలం ✍ (@kasturikalam) 's Twitter Profile Photo

ఒకసారి ఘంటసాల మాష్టారి శైలిలో జవరాలి సన్నిధిలో,కళ్యాణిరాగంలో hum చేయండి.  పాడండి. ఆనందానుభూతి Guarentee    చూచెదవేలనో ప్రణయసుందరి! కాటుక కళ్ళలోని ఆ లోచన లేమిటో హరిణలోచని ? నీ చిఱునవ్వులోని సం కోచము లెందుకో కుసుమకోమలి ? నీ మధురాధరమ్ములో దాచుకొనంగ నేటికి సుధామయసూక్తి కళావిలాసినీ!

కస్తూరి కలం ✍ (@kasturikalam) 's Twitter Profile Photo

అందరికీ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు చం ll తెలుగు పదంబు పల్కిన మదీయసుధాఝరులందు చెల్వమై లలిత సుభాషితంబులవి లాస్యములై, సుమపేశలమ్ములై పలుకుల పల్లవంబులకు వల్లరిలెన్నియొ కూర్చినట్లుగా చెలువము మీర పల్కెడి విశిష్టకవీంద్ర మనోజ్ఞధారలై

అందరికీ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు 

చం ll 
తెలుగు పదంబు పల్కిన మదీయసుధాఝరులందు చెల్వమై         
లలిత సుభాషితంబులవి లాస్యములై,  సుమపేశలమ్ములై          
పలుకుల పల్లవంబులకు వల్లరిలెన్నియొ కూర్చినట్లుగా        
చెలువము మీర పల్కెడి విశిష్టకవీంద్ర మనోజ్ఞధారలై
కస్తూరి కలం ✍ (@kasturikalam) 's Twitter Profile Photo

60 వసంతాలు పూర్తిచేసుకున్న సిసలైన సినీ సేవాంతికా సురభిళము మన "గుండమ్మ కథ" కం ll నిండైన తెలుగుదనమున్ గుండెలలో జిలికి రసచకోరకమౌ కో   దండంబు నిస్వనములా   "గుండమ్మ కథ" సినిమా మకుటమై మెరిసెన్ !

60 వసంతాలు పూర్తిచేసుకున్న సిసలైన సినీ సేవాంతికా సురభిళము మన "గుండమ్మ కథ"

కం ll
నిండైన తెలుగుదనమున్ 
గుండెలలో జిలికి రసచకోరకమౌ కో  
దండంబు నిస్వనములా  
"గుండమ్మ కథ" సినిమా మకుటమై మెరిసెన్ !
కస్తూరి కలం ✍ (@kasturikalam) 's Twitter Profile Photo

తొమ్మిది రహస్యాలు ఆయుర్విత్తం గృహచ్ఛిద్రం మంత్రమౌషధసంగమౌ దానమానావమానాశ్చ నవ గోప్యాని కారయేత్ II ఆయువు, సంపద, కుటుంబ కలహాలు, మంత్రం, ఔషధం, సంగమము, దానం మానం,అవమానం కొన్ని విషయాలు పైకి చెప్పుకోకుండా ఉంటేనే వ్యక్తి గౌరవం నిలబడుతుంది. బయటవారితో పంచుకోకూడని రహస్యాలు

కస్తూరి కలం ✍ (@kasturikalam) 's Twitter Profile Photo

సినిమా చూస్తున్నప్పుడు నవ్వు, కోపం, ఏడుపు, వేదన, జాలి, విరక్తి, నిస్సహాయత లాంటి ఎమోషన్స్ అన్నీ ఏకకాలంలో పరిచుంబించడం, హృదయమంతా వ్యాకులతతో పరిరంభించడంతో ఒక ఉద్వేగం, ఉద్విగ్నత ఈ మధ్య కాలంలో జరగలేదు పతాక సన్నివేశాల్లో బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ పోటీపడి నటించడం (జీవించడం) అపురూపం

కస్తూరి కలం ✍ (@kasturikalam) 's Twitter Profile Photo

అదృష్టం అనుకూలించాలంటే సాధారణ ప్రయత్నం, సరిపోదు "ఉద్యమం" చేయవలసిందే...

అదృష్టం అనుకూలించాలంటే సాధారణ ప్రయత్నం, సరిపోదు "ఉద్యమం" చేయవలసిందే...
కస్తూరి కలం ✍ (@kasturikalam) 's Twitter Profile Photo

గుమ్మడి వడియాలు, సగ్గుబియ్యం వడియాలు, పిండి వడియాలు, చల్ల మిరపకాయలతో మా ఇంట్లో నవారు మంచాలు, మడతమంచాలు అన్నీ బిజీ వచ్చే వారం కదనరంగానికి కత్తిపీటలతో కమనీయమైన మాగాయి ముక్కలకు సుముహూర్తం అన్నమాట

కస్తూరి కలం ✍ (@kasturikalam) 's Twitter Profile Photo

ఆరోగ్యం, అప్పులు లేకపోవడం, ఉదరపోషణార్ధం దూర ప్రదేశాలకు వెళ్ళవలసిన అవసరం లేకపోవడం (ఉన్న ఊళ్ళో ఉద్యోగం), మంచివారితో సహవాసం, ఆత్మవిశ్వాసంతో కూడిన జీవనోపాధి (స్వంత ఉపాధి), భయం లేని నివాసం ఈ ఆరు మాత్రమే కనిషికి సుఖం, ఆనందం అందించగలవు అని విదురనీతి

కస్తూరి కలం ✍ (@kasturikalam) 's Twitter Profile Photo

మనదీ ఒక బ్రతుకేనా ?? మనదీ ఒక ఆశయమేనా ? రాజకీయమే పరమావధిగా రక్కసిమూకలు అహంకారమే ఆలంబనగా అధమాధమములు కుక్కలూ, నక్కలూ కూడా సిగ్గుపడే దిక్కుమాలిన సమాజం !! అకటా

కస్తూరి కలం ✍ (@kasturikalam) 's Twitter Profile Photo

"స్వచ్ఛమైన స్నేహానికి" సంకేతాలు 1. ఆనందంగా ఇవ్వటం 2. ఇచ్చింది వద్దనకుండా పుచ్చుకోవడం 3. రహస్యాలు పంచుకోవడం 4. యోగక్షేమాలు తెలుసుకోవడం 5. వారు ఇచ్చింది భుజించడం 6. వారికి కూడా తినిపించడం (Party ఇవ్వడం) “షడ్విధం ప్రీతిలక్షణమ్” అన్నట్లు స్నేహం లక్షణాలు మన ఋషులు ఎప్పుడో చెప్పేశారు

కస్తూరి కలం ✍ (@kasturikalam) 's Twitter Profile Photo

ఒక రామచిలుక మా పెరట్లో జామపళ్లని కోరికేసింది ఒక పిల్లి పిల్ల మా ఇంట్లో దొంగతంగా పాలుతాగేస్తోంది ఒక కాకి మా వేపచెట్టు మీద పర్మిషన్ లేకుండా గూడు కట్టేసింది ఒక కోయిలమ్మ ఈ వసంతంలో Sound pollution చేస్తోంది ఒక ఎలకపిల్ల మా చిన్నబ్బాయి హోంవర్క్ పుస్తకం భోంచేసింది కేసులెలా పెట్టాలో ??

కస్తూరి కలం ✍ (@kasturikalam) 's Twitter Profile Photo

450 కోట్ల సంవత్సరాల వయసున్న ధరణిలో మన ప్రభవం, ప్రభావం 20 లక్షల సంవత్సరాల నుండి మాత్రమే రాశి చక్రగతులలో రాత్రిందివాల పరిణామాలలో బ్రహ్మాండ గోళాల పరిభ్రమణాలలో కల్పాంతాలకు పూర్వం కదలిక పొందిన పరమాణువు సంకల్పంలో ప్రభవం పొందినవాడా మానవుడా మానవుడా! అని శ్రీశ్రీ గారంటే ఓహో అనుకున్నా

450 కోట్ల సంవత్సరాల వయసున్న ధరణిలో మన ప్రభవం, ప్రభావం 20 లక్షల సంవత్సరాల నుండి మాత్రమే

రాశి చక్రగతులలో 
రాత్రిందివాల పరిణామాలలో
బ్రహ్మాండ గోళాల పరిభ్రమణాలలో
కల్పాంతాలకు పూర్వం కదలిక పొందిన
పరమాణువు సంకల్పంలో
ప్రభవం పొందినవాడా
మానవుడా మానవుడా!

 అని శ్రీశ్రీ గారంటే ఓహో అనుకున్నా
కస్తూరి కలం ✍ (@kasturikalam) 's Twitter Profile Photo

సరదాగా... ఆ.వె || ఎఱుపు రంగుతోడ మిరుమిట్లు గొల్పంగ జిహ్వపైన రుచులు చిందులాడు ! ఊరగాయ యన్న ఉత్తమోత్తమముగా ఆదరముగ భుజింపు "ఆవకాయ"

కస్తూరి కలం ✍ (@kasturikalam) 's Twitter Profile Photo

#శ్రీశ్రీ గారి #సిప్రాలి లోని స్టైల్ ల్లో చెప్పాలంటే అప్పట్లో సినిమా హాల్లో #గోల్డుస్పాట్ తాగేవాడు మాత్రం భాగ్యోన్నతుండే Arunn Bhagavathula చి లిపి కం చారున్ యెఱుగనివాడూ ! గోదారినతడవనోడు, గోల్డుస్పాట్ రుచిన్ నోరారగ నాల్కన చే కూరనివాడెవడు నాడు ! కువలయనాధా !

కస్తూరి కలం ✍ (@kasturikalam) 's Twitter Profile Photo

ధర్మవీరులారా ! నిర్మల మనస్కులారా ! ఘర్మజలం చిందించే కార్మికులారా నిత్యమూ "చైతన్యం" నింపుకుని “సత్య”సాధనకై శ్రమిద్దాం విజయ కింకిణుల ఘణంఘణలతో వీర దుందుభిలని మ్రోగిద్దాం ! పురోగతికై పయనిద్దాం ! అరాచకాలని అణచివేద్దాం !

ధర్మవీరులారా !
నిర్మల మనస్కులారా !
ఘర్మజలం చిందించే కార్మికులారా
నిత్యమూ "చైతన్యం" నింపుకుని
“సత్య”సాధనకై శ్రమిద్దాం

విజయ కింకిణుల ఘణంఘణలతో
వీర దుందుభిలని మ్రోగిద్దాం !
పురోగతికై పయనిద్దాం !
అరాచకాలని అణచివేద్దాం !
కస్తూరి కలం ✍ (@kasturikalam) 's Twitter Profile Photo

తీయనైన భాష తేనెలొలుకు భాష త్రిజన్మోహనమైన భాష త్రిలింగమున శోభించు భాష మైత్రీభావాల మధురమైన భాష నిరంతరం నాతోనే ఉండి నన్ను నన్నుగా ఉన్నతంగా ఆలోచింపచేసింది ఔన్నత్యం చాటేది ప్రసన్నమైన కిన్నెరసానిలా అందమైన వాగులా వంకలా వయ్యారంగా పాటై పదమై పద్యమై పరవశమై పలికించేదీ అమ్మ భాష

కస్తూరి కలం ✍ (@kasturikalam) 's Twitter Profile Photo

గాంధీ - శాస్త్రి గార్ల జయంతి కం సత్యాన్వేషణ శరమై సత్యాగ్రహమేసమైక్య సౌగంధంబై ప్రత్యక్షమాయె బాపూ నిత్యోపాసన ఘటింప నీ నుడువులతో గీ జై జవాన్ జై కిసానుఉచ్చైశ్రవముగ నిశ్చయమగు నీతిని జూపు నీ నియమము భరతమాత ముద్దులబిడ్డ భాగ్యశాలి లాలు బహదూరు శాస్త్రికి లాల్సలాము